సగం తిన్న యాపిళ్లను జనంపైకి విసిరిన డీకే శివకుమార్.. నెటిజన్ల ఆగ్రహం!
- డీకే. శివకుమార్ యాపిల్ వీడియో వైరల్
- కనకపుర పర్యటనలో ఘటన
- భారీ యాపిల్ హారంతో స్వాగతించిన స్థానికులు
- పండు కొరికి జనంపైకి విసిరిన నేత
- రాచరికపు పోకడలంటూ నెటిజన్ల విమర్శలు
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఒక యాపిల్ పండును కొరికి, ఆ సగం తిన్న ముక్కను రోడ్డుపై ఉన్న జనం వైపు విసిరారు. దీనిపై ఆన్లైన్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
శివకుమార్ తన సొంత నియోజకవర్గమైన కనకపుర పరిధిలోని హారహళ్లి ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ ఘటన జరిగింది. అక్కడ స్థానిక మద్దతుదారులు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇందులో భాగంగా వందలాది యాపిల్ పండ్లు, పూలతో తయారు చేసిన ఓ భారీ ‘గజమాల’ను క్రేన్ సహాయంతో ఆయనకు బహూకరించారు. ఆ సమయంలో వాహనంపై ఉన్న డీకే శివకుమార్, ఆ హారం నుంచి ఒక యాపిల్ పండును తీసి, నోటితో కొరికి జనం వైపు విసిరేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన కొద్దిసేపటికే పెద్ద దుమారం రేగింది. ఆయన మద్దతుదారులు దీన్ని ‘అభిమానులతో సరదాగా గడిపిన క్షణం’ అని సమర్థిస్తుండగా.. మెజారిటీ నెటిజన్లు మాత్రం ఈ ప్రవర్తనపై తీవ్రంగా మండిపడుతున్నారు. ‘‘డీకే శివకుమార్ తనను తాను దేవుడిగా భావిస్తున్నారా? ఎంగిలి యాపిల్‌ను ప్రసాదంలా జనంపైకి విసరడం ఏంటి?’’ అని ప్రశ్నిస్తున్నారు. ‘‘ఇది ప్రజాస్వామ్యం కాదు. రాచరికపు పోకడ.. ప్రజలను పెంపుడు జంతువుల్లా చూస్తూ ఎంగిలి ముక్కలు విసరడం అత్యంత అసహ్యకరం’’ అంటూ నెటిజన్లు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.